ఆఫీసర్ సెన్సార్ పూర్తి..

259
- Advertisement -

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ- కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్.’ శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శివ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మిగిలింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.

కర్ణాటకకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా నాగ్ చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి. నాగ్ స‌ర‌స‌న మైరా స‌రేన్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ ,షాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -