ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని పిన్డ్ రెస్టారెంట్లో జరిగింది . ఈ కార్యక్రమంలో మోతీ కౌల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూ అండ్ కాశ్మీర్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు మోతీ కౌల్ ప్రవాస కాశ్మీరీలు మరియు కాశ్మీరీ పండితులు, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు సభకు విచ్చేసిన ప్రవాస భారతీయులను , కాశ్మీర్లో నెలకొన్న శాంతి భద్రతల గురించి వివరించారు.
అలాగే కేంద్రం లో ఉన్న మోడీ ప్రభుత్వం కాశ్మీరీయుల కోసం చేపట్టుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి , మరియు , దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి వివరించారు. అలాగే కాశ్మీరీల కోసం కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి గురించి వివరించారు.
ఈ సందర్భంగా ,ప్రవాస కాశ్మీరీయులు, కాశ్మీరీ పండితులు మరియు ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు మోతీ కౌల్ జవాబులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ నిబంధన 370 , వేర్పాటువాద నేతలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, కాశ్మీరీ పండితుల పునరావాసికరణం మరియు ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంశాలఫై చర్చించారు.
ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు జయేష్ పటేల్, ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు కల్పన శుక్ల, బాల గురు, నీలిమ మదన్ గార్లు , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు ఆనంద్ జైన్ మరియు రవి బుద్ధానూరు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గార్లు, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్లు , జయశ్రీ నాయర్, దిగంబర్ ఇస్లాంపురే గార్లు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ పార్తీబన్ వర్ధన్,సహా -కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి మరియు గుంజన్ మిశ్ర , ఫణిభూషణ్ తాడేపల్లితో పటు చాల మంది ప్రవాస భారతీయలు, కాశ్మీరీలు మరియు కాశ్మీరీ పండితులు పాల్గొన్నారు.