- Advertisement -
ఒడిశా సీఎం పుట్టినరోజు పురస్కరించుకొని 57వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇకపై కాంట్రాక్టు నియామకాలను రద్ధు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నవారిని క్రమబద్ధీకరించనున్నామని తెలిపారు. ఆపై ఈవిధానంలో భర్తీ ప్రక్రియను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్టు పట్నాయక్ వీడియో సందేశంలో తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి యేటా రూ.1300కోట్ల అదనపు భారం పడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- Advertisement -

