వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజైంది. ముంబైలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో షెడ్యూల్‌ని ప్రకటించింది. అక్టోబర్ 5న మెగా టోర్నీ ప్రారంభంకానుండగా అక్టోబర్ 15వ తేదీన దాయాదుల పోరు ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు అహ్మాదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా 10 వేదికల్లో 46 రోజుల పాటో మెగా టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జరుగనుంది.
Also Read:వయ్యారి భామ పాట లుక్ లో పవన్
భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుండగా టోర్నీలో మొత్తం 10 జట్లు ఉంటాయి. జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయిర్ టోర్నీ నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. ప్రతి జట్టు తొమ్మిదిసార్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడుతాయి. టాప్ నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ మ్యాచ్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరుగనుంది.
Also Read:Tomato:సెంచరీ కొట్టిన టమోట..