ఓడీఎఫ్.. దేశంలో తెలంగాణ నెంబర్ వన్

30
- Advertisement -

దేశంలోనే తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ సర్వేలో తెలంగాన ఓడీఎఫ్ ప్లస్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. కేంద్రప్రభుత్వం నిర్వహించిన 4తాజా సర్వేల్లో తెలంగాణ ప్రతిభని చాటింది. అత్యధిక టాయిలెట్స్‌ ఉన్న ఉన్న 5 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణ గ్రామీణ ప్రజానీకం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు మరియు ఇండ్ల విభాగాల్లో 100శాతం స్వచ్ఛత అవార్డును గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9యేళ్లలోపే ఈ మైలు రాయిన దాటిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి హరీశ్రావు అన్నారు.

డబుల్ ఇంజన్‌తో పని లేకుండానే డబుల్ ప్రతిభ కనబరిచిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. డబుల్‌ ఇంజిన్‌కు డబుల్ పనిచేస్తున్న సర్కార్లకు ఇదీ తేడా ఉంటుందని హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ అవార్డులు ప్రకటించిన కేంద్రంకు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం నిరంతరాయంగా పనిచేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయితీ రాజ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

గురుకులాల్లో ప్రవేశాల కోసం..సైట్‌ ఇదే..!

త్వరలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలు..

పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. నిజమేనా?

- Advertisement -