తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’, ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ చేసిన తమన్నా పోస్టర్స్, లుక్ ఆకట్టుకోగా తాజాగా టీజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కుంభమేళాలో ఓదెలా 2 టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్లు పవర్‌ఫుల్ లుక్‌ని రిలీజ్ చేశారు.
ఓడెలా 2 చిత్రాన్ని మధు క్రియేషన్స్ బ్యానర్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ఓడెలా 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా నాగా సాధువు అవతారంలో కనిపించనున్నారు. కాంతార చిత్రానికి సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Also Read:ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..

