- Advertisement -
నేడు ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో తుది తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. 14 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువరించనుంది సీబీఐ కోర్టు.గాలి జనార్దన్ రెడ్డిపై అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే.
నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణ వచ్చాయి. ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి రోశయ్య ప్రభుత్వం జీవో. 71 విడుదల చేసింది.
2011లో మొదటి చార్జిషీటు దాఖలు చేసింది సీబీఐ. రూ.884. కోట్ల ప్రజాధనం లూటీ చేశారని సీబీఐ అభియోగాలు మోపగా 219 మంది సాక్షులను విచారించి, 3,400 డాక్యుమెంట్లలతో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
Also Read:Heart Attack:గుండెపోటు..జాగ్రత్తలివే!
- Advertisement -

