మైఖేల్ జాక్సన్ సాంగ్ కు అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్ స్టెప్పులేశారు. వైట్ హౌస్ లో జరిగిన తన చివరి హాలోవీన్ ట్రిక్ (ట్రీటింగ్ సెర్మనీ)లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు నాలుగు వేల మందిని ఆహ్వానించారు. హాజరైన వారిలో అధిక శాతం ఎలిమెంటరీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, మిలిటరీ కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ సాంగ్ కు ఒబామా దంపతులు స్టెప్పులేశారు.
వచ్చిన గెస్ట్‌లతో ఆయన సరదాగా గడిపారు. జోకులు వేసి నవ్వించారు. ఈ హాలోవీన్ ట్రిక్ ఆర్ ట్రీటింగ్ సెర్మనీ కోసం ఒబామా దంపతులు వైట్‌హౌజ్‌లోని సౌత్ లాన్‌ను అందంగా డెకొరేట్ చేశారు. వాషింగ్టన్ ఏరియాలోని ఎలిమెంటరీ స్కూల్స్, మిలిటరీ కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మరోవైపు మిచెల్లీ ఒబామాకు హిల్లరీ క్లింటన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నవంబర్ 8న జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, మిచెల్లీని తన కేబినెట్లోకి తీసుకుంటానని డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యా వంటి పలు సమస్యలపై మిచెల్లీ ఎంతో అవగాహనతో ఉన్నారని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మిచెల్లీ కోరుకుంటున్నట్టు హిల్లరీ పేర్కొన్నారు.