సాధారణంగా పాలు బలవర్ధకమైన పోషకాల సమ్మేళనంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రతిరోజూ గ్లాసు పాలు తాగితే ఎముకలు కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే పాలకు ఉండే వాసన కారణంగా కొందరు అలెర్జీ గా ఫీల్ అవుతుంటారు. అందువల్ల పాలు తాగడానికి కూడా ఆసక్తి చూపరు. అలాంటి వారికి ఓట్ మిల్క్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఈ ఓట్ మిల్క్ లో సాధారణ పాలలో ఉండే అన్నీ రకాల పోషకాలు లభిస్తాయట. ఇంకా సాధారణ మిల్క్ తో పోల్చితే ఓట్ మిల్క్ లో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంటుందట. కాబట్టి పాలంటే అలెర్జీగా ఫీల్ అయ్యే వారు ప్రతిరోజూ ఓట్ మిల్క్ తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిదని చెబుతున్నారు ఆహార నిపుణులు. .
ఓట్ మిల్క్ ను తయారు చేయడం కూడా చాలా సులభం ఒక కప్పు ఓట్స్ తీసుకొని వాటిని నీటిలో బాగా నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన ఓట్స్ మిశ్రమానికి కొద్దిగా తేనె లేదా చెరుకు రసం, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, రెండు లేదా మూడు ఖర్జూరాలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత దానిని వడబోసి పాల రూపంలో తీసుకోవాలి. ఈ ఓట్ మిల్క్ ను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓట్స్ లో ఉండే బి12 విటమిన్ కారణంగా చర్మ సంరక్షణకు జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. ఇంకా ఓట్ మిల్క్ ప్రతి రోజూ తాగితే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు దరి చేరవు. ఇందులో తక్కువ కొలెస్ట్రాల్ శాతం ఉండటం వల్ల బరువు తగ్గడంలో కూడా సహాయ పడుతుంది. కాబట్టి పాలు తాగలేని వారు ఓట్ మిల్క్ తాగడం మంచిది..
Also Read:అవకాడో తింటే ఉపయోగాలే.. కానీ?