ఇది అంతా స్టార్ల మయం. అసలు కొత్తగా ఓ హీరోయిన్ మార్కెట్లోకి అడుగు పెడితే ఎంతిస్తారు ? బయట లెక్కల్లో చూసుకుంటే మహా అయితే 30-40 లక్షలు ఇస్తారు. బాలీవుడ్ లో అయితే మరో పది ఎక్కువ ఇస్తారు. కానీ మొదటి సినిమాకే కోటి 50 లక్షలు రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటుంది నైసా దేవగణ్. అసలు ఫస్ట్ సినిమాకే కోటి తీసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా ? అంటే… లేరు అనే సమాధానమే వస్తోంది. మాజీ హోమ్లీ బ్యూటీ కాజోల్ కి ఒక చిరకాల కోరిక ఉంది. తన కూతురు నైసా దేవగణ్ ని పెద్ద హీరోయిన్ ను చేయాలని. చిన్నప్పటి నుండి తన కూతురు నైసా దేవగణ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది.
పైగా సినిమాల్లోకి ముందుగా ఎంట్రీ ఇస్తోంది కాబట్టి, పెద్దగా కష్టపడకుండానే, తనకున్న స్టార్ డమ్ తన కూతురికి వచ్చేస్తోంది అని నైసా దేవగణ్ ఎప్పుడూ అంటుందట. ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఉంది. కాజోల్ ఊహించినట్టుగానే జరుగుతుంది. నైసా దేవగణ్ కి కాజోల్ స్టార్ డమ్ బాగా కలిసొచ్చింది. ఎక్కువ కష్టపడకుండానే ఆమెకు కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నైసా దేవగణ్ రెండు చేతుల నిండా సంపాదిస్తోంది. అయితే, ఇక్కడ నైసా దేవగణ్ ను తక్కువ చేయలేం, అందంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది.
పైగా పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ తో పాటు ఎక్స్ పోజింగ్ లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చక్కగా దర్శకులు కోరినట్టు ముందుకు పోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ యంగ్ బ్యూటీగా ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తోంది నైసా దేవగణ్. అయితే కాజోల్ చిరకాల కోరిక మాత్రం ఇంకా తీరలేదు. తన కూతురు ఎంత సక్సెస్ సాధించినా కాజోల్ కి ఎక్కువ సంతోషాన్ని కలిగించదు అని అజయ్ దేవగణ్ కూడా ఫీల్ అవుతున్నాడట. ఆమెను గొప్ప నటిగా చూడాలని కాజోల్ ఆశ పడుతుంది అని అజయ్ దేవగణ్ చెబుతున్నాడు.
Also Read:Union Budget 2024 : హైలైట్స్ ఇవే