సుధాకర్ కోమాకుల హీరోగా నిత్యా శెట్టి హీరోయిన్ గా బేబీ జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలిమ్స ,యస్ జె కె ప్రొడక్షన్స్ బ్యానర్ల పై హరినాథ్ బాబు బి.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నువ్వు తోపురా. ప్రముఖ హీరోయిన్ నిరోషా ముఖ్య పాత్రలో నటిస్తుండగా నెస్ససీటీ ఈజ్ మదర్ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. అమెరికా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈచిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ :
సూరి (సుధాకర్ కోమాకుల) ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌లో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం, తల్లి (నిరోష) ఉద్యోగం చేస్తుండటంతో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ జులాయిగా తయారవుతాడు. ఈ క్రమంలో రమ్య (నిత్య శెట్టి)ని ప్రేమిస్తాడు. సీన్ కట్ చేస్తే రమ్య అమెరికా వెళ్లిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది…?అమెరికా వెళ్లిన సూరికి ఎలాంటి అనుభవం ఎదురైందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,డైలాగ్స్,ఎమోషనల్ సీన్స్. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌లో నాగరాజు పాత్రలో ఆకట్టుకున్న సుధాకర్ ఈ సినిమాలో పర్వాలేదనిపించాడు.కామెడీ, డైలాగ్స్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా పర్యవాలేదనిపించింది నిత్య శెట్టి . చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన నిరోష పర్వాలేదనిపించింది. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్, ఫస్ట్ హాఫ్,బలమైన విలన్ లేకపోవడం. లవ్ సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి, పీఏ దీపక్‌ల సంగీతం బాగుంది. అజ్జు మహంకాళి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ప్రకాష్ వేలాయుధన్, వెంకట్ సీ దిలీప్‌ల సినిమాటోగ్రపి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల. తొలి సినిమాతో పక్కింటి అబ్బాయిగా కనిపించిన సుధాకర్ ఈ సినిమాలో హీరోయిజం చూపించే ప్రయత్నం చేశాడు. కథ,డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా ఒక్క హీరో పాత్ర తప్ప మరే పాత్ర బలంగా లేకపోవటం కూడా నిరాశకలిగిస్తుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ నువ్వు తోపురా.
విడుదల తేదీ:03/05/2019
రేటింగ్: 2 /5
నటీనటులు: సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి
సంగీతం : సురేష్ బొబ్బిలి
నిర్మాత : శ్రీకాంత్
దర్శకత్వం : బి. హరినాథ్ బాబు