బ్రిటన్‌ రాణి అస్తమయం….ముంబాయి డబ్బావాలాల విచారం

166
dabba
- Advertisement -

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మరణం పట్ల యావత్‌ ప్రపంచం విచారం వ్యక్తం చేసింది. అయితే ఆ జాబితాలో ముంబాయి డబ్బావాలాలు కూడా చేరారు. ఇదీ కామన్‌ కదా అంటారమో… ప్రపంచంలో ఎక్కడైనా ప్రముఖులు మరణిస్తే ఎవరైనా సంతాపం, విచారం ప్రకటిస్తారు. దీన్లో ఏం ఉంది అనుకుంటున్నారమో కానే కాదు. బ్రిటన్‌ రాజ కుటుంబంలో జరిగిన ప్రిన్స్‌ ఛార్లెస్‌ కెమిల్లాల వివాహాం ( ఛార్లెస్‌ రెండవ వివాహాం)కు ఎలిజబెత్‌-2 రాణి ముంబాయి నుంచి ఇద్దర్నీ ప్రత్యేక ఆహ్వానీతులుగా పిలిచారు. వారు ఎవరో తెలుసా…. నూతన్‌ ముంబాయికి చెందిన టిఫిన్‌ బాక్స్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌కు చెందిన నాఘునాథ్‌ మడ్గే, సోపన్‌ మారే. రాణి వారి ఆహ్వానించడంతో వారిద్దరూ ఆ వేడుకకు హాజరయ్యారు. తాము మహారాణితో పాటు రాజ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో కలిసి రెండు సార్లు ఉదయం అల్పాహారం చేశామన్నారు. రాజ లాంఛనాలతో 8 రోజుల పాటు లండన్‌లో పర్యటించామని వారు గుర్తు చేసుకున్నారు. ఇటువంటి కష్టసమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -