‘అందరికీ హోలీ శుభాకాంక్షలు’.. ఎన్టీఆర్

505
ntr holi
- Advertisement -

దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగను చిన్న పిల్లాడి నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. కాకపోతే ఈ సారి క‌రోనా భ‌యం వ‌ల‌న హోలీ సెలెబ్రేషన్స్‌ కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ, కొన్ని చోట్ల మాత్రం ఈ వేడుక‌లు ఘ‌నంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ సెలెబ్రెటీస్‌ కూడా వారి ఫ్యామిలీ.. ఫ్రెండ్స్‌తో హోలీని జరుపుకుంటున్నారు.

తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ ద్వారా తన విషెస్ ని తెలిపాడు. హోలీ సందర్భంగా తన భార్య ఇద్దరు పిల్లలతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. అందరూ తెల్లటి దుస్తులతో నవ్వులు చిందిస్తూ ఫొటోలో ఉన్నారు. రసాయనాలు లేని రంగులు ఇంకా చెప్పాలంటే స్వచ్ఛమైన పసుపుతో వారు హోలీ జరుపుకున్నట్టు కనపడుతోంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తారక్‌ ఆర్ఆర్‌ఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు.

- Advertisement -