బీజేపీలోకి సింధియా…బీజేపీఎల్పీ నేతగా శివరాజ్‌..!

306
scindia
- Advertisement -

కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలో కలిసి బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రాజీనామా లేఖను సోనియాకు పంపించారు.

రాజీనామా అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సింధియా. ఆయన్ని తన కారులో స్వయంగా ప్రధాని దగ్గరకు తీసుకెళ్లారు అమిత్ షా. ఇవాళ సాయంత్రం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుండగా బీజేఎల్పీ నేతగా శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఎన్నుకోనున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని పార్టీ విజయపథంలో నడిపించారు సింధియా. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని భావించిన కమల్‌నాథ్‌ను సీఎంగా చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో అప్పటినుండి పార్టీపై గుర్రుగా ఉన్న సింధియా టైం చూసి దెబ్బకొట్టాడు. సింధియా వర్గం నుండి 20 ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరితే 15 నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కమల్‌నాథ్ సర్కార్‌ కుప్పకూలడం ఖాయం.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 228, కాంగ్రెస్ 114,బీజేపీ 107 సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బిఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు ఆపార్టీని వీడనుండటంతో ప్రభుత్వం పడిపోవడం ఖాయం.

- Advertisement -