‘దేవర’.. ప్రీ సేల్స్‌ అదుర్స్!

6
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య విడుద‌లైన ఫియ‌ర్ సాంగ్, చుట్ట‌మ‌ల్లే.. , దావుడి సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి.

ఓవ‌ర్‌సీస్‌లో ‘దేవర’ అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌త్యాంగిర సినిమాస్ అమెరికాలోనే ఎప్పుడు ఎవ‌రూ చేయ‌నంత గొప్ప‌గా రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తోంది. రీసెంట్‌గానే ప్రీ బుకింగ్స్‌ను యు.ఎస్‌లో ఓపెన్ చేయగా అక్కడ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్ప‌టికే ప్రీ సేల్స్ ఐదు ల‌క్ష‌ల డాల‌ర్స్‌ను దాటేయ‌టం విశేషం.

సినిమాపై ఉన్న బ‌జ్‌, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకీ పెరుగుతోందే కానీ త‌గ్గ‌టం లేదు. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాటిక్ ఫీల్‌ను తెర‌పై ఎంజాయ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. అభిమానులు టికెట్స్ కోసం ఎగ‌బ‌డుతున్న తీరు చూస్తుంటే దేవ‌ర బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తార‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

ఈ స్పీడు చూస్తుంటే యు.ఎస్‌లో దేవ‌ర రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే రాబోతున్న ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌తో ఈ అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు రీచ్ అవుతాయ‌న‌టంలో సందేహం లేదు. 2024లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ యాక్ష‌న్ చిత్రంలో భైరా అనే పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఈ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Also Read:రాష్ట్రానికి భారీ వర్ష సూచన..

- Advertisement -