దర్శకధీరుడు రాజమళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీపై దృష్టిసారించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా రామ్ చరణ్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు తారక్.
ఇక ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశారు ఎన్టీఆర్. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాగా ఈ మూవీకి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ని ఖరారుచేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక తాజాగా ఎన్టీఆర్ మరోమూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఇటీవలె కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ మూవీకి న్యూక్లియర్ లేదా మిస్సైల్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.