NTR30 షూటింగ్ ఎప్పుడంటే?

35
- Advertisement -

ఎన్టీఆర్ , కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కనున్న NTR30 సినిమాకు సంబందించి క్రేజీ అప్ డేట్ బయటికొచ్చింది. కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ? అందరూ వెయిట్ చేస్తున్నారు. తాజాగా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా లాంచ్ కి ముహూర్తం ఫిక్సయింది. మార్చ్ 18 న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుంది. మార్చ్ 30 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నాడు. అక్కడ ఆస్కార్ వేడుకలో పాల్గొనబోతున్నాడు. మార్చ్ 12న ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఆ వేడుక పూర్తయిన రెండు మూడు రోజులకి ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగి రానున్నాడు. వచ్చిన వెంటనే ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ జరగనుంది. ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఫర్ ది ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రిలీజ్ చేసుకుంటున్నాడు కొరటాల. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టబోతున్నారు. దానికి తగ్గట్టే భారీ బిజినెస్ అవ్వడం ఖాయం.

యువ సుధా ఆర్ట్స్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకి ఇదే మొదటి తెలుగు సినిమా. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -