‘ఎన్టీఆర్ 30’కి లీకుల బెడద

41
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకి లీకుల బెడద తప్పడం లేదు. NTR 30 సినిమా షూటింగ్‌కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చి ప్రస్తుతం వైరల్ గా మారింది. సినిమా సెట్ లో షూట్ గ్యాప్ మధ్యలో ఎన్టీఆర్ ఇద్దరు ఆర్టిస్ట్‌లతో ఏదో మాట్లాడుతున్న సమయంలో ఈ ఫొటోని తీశారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ లైట్ గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ పిక్ ను తెగ షేర్ అండ్ లైకులతో హడావుడి చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ – వెన్నెల కిషోర్ – ప్రకాష్ రాజ్ లపై కొన్ని ప్రత్యేకమైన మాంటేజ్ సీన్స్ ను తీస్తున్నారు. అన్నట్టు హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నాడు. ఈ నెల నాలుగో వారం నుంచి కెన్నీ బేట్స్ ఈ టీమ్ తో జాయిన్ కానున్నాడు. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచే ఈ సినిమా షూట్ లో జాయిన్ కానుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ మూవీ.

ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. మరి ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు వచ్చిన క్రమంలో ఎన్టీఆర్ సినిమాలపై మరింత అంచనాలు పెరిగాయి. అందుకే ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఈ క్రమంలోనే, నటీనటుల విషయంలో కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అలాగే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు. కాబట్టి.. ఈ సినిమాలో అందర్నీ నేషనల్ రేంజ్ ఆర్టిస్ట్ లనే తీసుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి…

జర్నలిస్ట్ గా మాజీ హీరో

ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం!

వెట్రిమారన్ నుండి మరో కల్ట్ సినిమా

- Advertisement -