కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన 30 వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమవుతూ వస్తున్న ఈ సినిమాపై ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అనే రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. అసలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం కష్టమే అంటూ కొందరు రూమర్స్ సృష్టిస్తున్నారు. పైగా నెలలు గడుస్తున్నా షూటింగ్ కి వెళ్లకపోవడం ఈ రూమర్ కి ఆద్యం పోసినట్టైంది.
నిజానికి ఈ పాటికే ఈ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇంకా లేట్ అవుతుంది. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలంటూ మేకర్స్ ప్రకటించారు కానీ ఈ నెలలో షూటింగ్ మొదలు కావడం కష్టమనే టాక్ వినిపిస్తుంది. మార్చ్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కొరటాలతో తారక్ , కళ్యాణ్ రామ్ డిస్కషన్స్ జరుపుతూనే ఉన్నారని తెలుస్తుంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చ్ నుండి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే మరో రెండు నెలలు ఆలస్యం అవ్వడం ఖాయం. ఇంకా మార్పులు , చేర్పులు చేస్తుందటమే ఇందుకు కారణమని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి…