ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న NTR30 కి సంబంధించి మెయిన్ కాస్టింగ్ ఫైనల్ అయింది. ఈ సినిమాలో తారక్ కి జోడీగా జాన్వీ కపూర్ కనిపించనుంది. ఎప్పుడో హీరోయిన్ ని ఫైనల్ చేసుకున్నారు. మార్చ్ 6న జాన్వీ పుట్టిన రోజు నాడు ఆమెకు వెల్కమ్ చెప్పి ప్రకటించబోతున్నారు. అక్కడి నుండి సినిమా ప్రమోషన్ కి శ్రీకారం చుట్టి ఇక వరుసగా అప్ డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన ఈ సినిమా మార్చ్ 16 తర్వాత ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ లోగ ఎన్టీఆర్ అమెరికా ఆస్కార్ ట్రిప్ కంప్లీట్ చేసుకొనివస్తాడు. యువ సుధా ఆర్ట్స్ బేనర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజర్. రత్నవేలు, సభు సిరీల్ లాంటి టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయనున్నారు.
కొరటాల ఎన్టీఆర్ కాంబోలో రెండో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ నుండి షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి…