సెట్స్‌ పైకి …ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ

247
NTR - Tri Vikram Movie Shoot Begins Tommrow
- Advertisement -

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్- త్రివిక్రమ్ రేపటి(13-04-18)నుంచి సెట్స్‌ పైకి వెళ్లనుంది. సోషల్ మీడియా ద్వారా అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్. తారక్‌ని కూడా కొత్త అవతారంలో చూడబోతున్నాం… అతడి న్యూ లుక్‌తో మీరంతా ఆశ్చర్యపోవడం ఖాయమంటూ పీఆర్వో మహేష్ కోనేరు ట్వీట్ చేశారు. ఈ నెల 13 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ జరగబోతోంది. శుక్రవారం ఎన్టీఆర్‌ షూటింగ్‌ను ప్రారంభించనుండగా త్రివిక్రమ్ అద్భుత స్క్రీప్ట్ అందించారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు తారక్‌. ఇప్పటికే సినిమాలో కొత్తగా కనిపించేందుకు తారక్ జిమ్‌లో చేస్తున్న వర్కవుట్స్‌ సోషల్ మీడియాలో హల్ చల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక తారక్‌కి ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇస్తున్న లాయిడ్ స్టీవెన్స్ సైతం తుపాన్ రాబోతుంది అని తెలపడంతో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందా అన్నదా సస్పెన్స్ కొనసాగుతోంది.

ఓ నవల ఆధారంగా త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్‌పై యూనిట్ ఇంకా క్లారిటీ రాలేదు. హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నా… అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్…రాజమౌళి మల్టీస్టారర్‌ తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నాడు. తారక్‌తో పాటు రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.

- Advertisement -