ఒకే వేదిక‌పై నంద‌మూరి హీరోలు..

391
Junior NTR
- Advertisement -

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన బాల‌య్య‌, ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌లని ఒకే వేదిక‌పై చూడాల‌ని అభిమానులు ఎన్నాళ్ళ‌నుండో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో నేడు జ‌ర‌గ‌నున్న అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్‌లో అభిమానుల కోరిక తీర్చ‌నున్నారు ఈ ముగ్గురు హీరోలు. హైదరాబాదులోని శిల్పాక‌ళా వేదిక‌లో జ‌రిగే విజ‌యోత్స‌వ స‌భ‌కి బాల‌య్య‌,క‌ళ్యాణ్ రామ్‌లు ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నార‌ని సమాచారం.

Junior NTR

అయితే చాలా ఏళ్ల తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్‌లు ఒకే వేదికపై కనిపించనున్నారనే వార్త తెలియగానే నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. గతంలో బాలయ్య సినిమా ‘సింహా’కు సంబంధించిన కార్యక్రమానికి తారక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్‌ సినిమా ప్ర‌మోష‌న్ కోసం బాబాయ్ వ‌స్తున్నాడు. ఇదిలా ఉంటే బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమాలో క‌ల్యాణ్ రామ్ హరికృష్ణ పాత్ర పోషిస్తుండ‌గా, జూ.ఎన్టీఆర్‌తో కూడా ముఖ్య పాత్ర చేయించాల‌ని వారు అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ వార్తే క‌నుక నిజ‌మైతే అభిమానుల ఆనందం ఎల్ల‌లు దాట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

- Advertisement -