ఎన్టీఆర్‌ను డైలామాలో పడేసిన ఇజం .!

506
Online News Portal
NTR to Compensate 'Ism' Buyers?
- Advertisement -

ప్రతి జర్నలిస్టుకీ ఓ ఐడియాలజీ, థియరీ ఉంటుంది. అవినీతిమయమైన సమాజంలో నిజాయతీ గల జర్నలిస్ట్‌ పోరాటాన్ని ఎలా సాగించాడు? అనే కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘ఇజం’. నందమూరి కళ్యాణ్ రామ్‌ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. పూరీ జగన్నాధ్ నందమూరి అభిమానులను నిరాశపరిచాడు. ఈ సినిమా హీరో-నిర్మాత కళ్యాణ్‌ రామ్‌నే కాదు.. సినిమా బయ్యర్లను కూడా కష్టాల్లో పడేసిందట.

పూరీ జగన్నాధ్ మీద నమ్మకంతో ఇజం సినిమా కోసం సుమారు రూ. 20 నుండి 22 కోట్ల వరకు కళ్యాణ్‌ రామ్ ఇన్వెస్ట్‌ చేశాడట. తరువాత పెట్టుబడిని రాబట్టుకునేందుకు ఎక్కువ ధరలకు తన సినిమా హక్కులను అమ్ముకున్నాడు హీరో మరియు నిర్మాత కళ్యాణ్ రామ్. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల మార్క్‌ని టచ్‌ చేసింది ఇజం. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.4 కోట్లను వసూలు చేసింది. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే ఇది రికార్డ్‌ కలెక్షన్లుగా చెప్పవచ్చు. ఇప్పటివరకు కళ్యాణ్‌ రామ్ చేసిన సినిమాలన్నింటిలో ఏ సినిమా కూడా ఇంత మొత్తం వసూలు చేయలేదు.

puri-jagannadh-nandamuri-kalyan-ram-jagapathi-babu

కళ్యాణ్ రామ్ చాలా రోజుల తరువాత హిట్ కొట్టిన పటాస్ మూవీ టోటల్‌ రన్‌టైంలో రూ.15 కోట్లను వసూలు చేసింది. అయితే ఇజం సినిమా హిట్‌ టాక్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా రూ.25 కోట్లను వసూలు చేయాల్సిందేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ ఈ సినిమా రూ. 11-12 కోట్ల మధ్యలోనే ఆగిపోయే అవకాశాలున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

కళ్యాణ్‌ రామ్‌-పూరి జగన్నాధ్ల కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. అందుకే ముందు జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ తరువాత సినిమా హక్కులు తమకే ఇప్పించాలని బయ్యర్లు కళ్యాణ్‌ రామ్‌ని రిక్వెస్ట్‌ చేస్తున్నారట. ఎందుకంటే ఎన్టీఆర్ నెక్స్ట్‌ సినిమా ఎన్టీఆర్ బ్యానర్స్‌లో రాబోతున్నట్టు ఇంతకుముందే నందమూరి వారు ప్రకటించారు.

మరోవైపు శాటిలైట్‌ హక్కులకు సంబంధించిన రూ. 3 కోట్లను కాంపన్సేట్‌ చేసినప్పటికీ.. ఇంకో ఆరు నుంచి ఏడు కోట్ల వరకు నష్టం తప్పదని కళ్యాణ్ రామ్ అంచనా వేస్తున్నాడట. ఇక ఈ సినిమాతో వచ్చిన నష్టాన్ని ఎన్టీఆర్‌ సినిమాతో పూడ్చకోవాలని కళ్యాణ్‌ బావిస్తున్నాడని సమాచారం. కాగా, ఎన్టీర్‌ తన తరువాతి సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్లో చేస్తాడా.. చెయ్యడా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. మొత్తానికి ఇజం సినిమా  ఎన్టీఆర్‌ ను డైలామాలో పడేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్..

- Advertisement -