ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..

164
nbk
- Advertisement -

మాజీ సీఎం,లెజెండరీ నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు నందమూరి బాలకృష్ణ. శతజయంతి ఉత్సవాల వివరాలను వెల్లడించిన బాలయ్య…మే 28 నుంచి శత జయంతి ఉత్సవాలు ఏడాదిపాటు జరుగుతాయని పేర్కొన్నారు.

తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని,శక పురుషుని శత జయంతి పేరుతో వేడకలను నిర్వహిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు.తమ కుటుంబం నుంచి నెలకు ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని….ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తామన్నారు. నెలకు రెండు ఎన్టీఆర్‌ పురస్కారాలు ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -