కాగ్ నోటీసులపై స్పందించారు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కు సంబంధించి ట్యాక్స్ విషయంలో ఎన్టీఆర్… కాగ్ నోటీసులు అందుకున్నారు. సుమారు కోటి పది లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టారని నోటీసులో పేర్కొంది ఆర్థికశాఖ. నోటీసుల అంశంపై ఎన్టీఆర్ మాట్లాడుతూ….. జరిగిన సంఘటనలు వివరించడం సబబు అని భావించి దీనిపై రియాక్ట్ అవుతున్నట్టు తెలిపారు. త
మ సినిమా పూర్తిగా లండన్ లో నిర్మించామని, లండన్ లో తీసిన సినిమాకు భారత్ లో టాక్స్ వర్తించదన్నారు ఎన్టీఆర్. చట్ట ప్రకారమే నాన్నకు ప్రేమతో చిత్ర నిర్మాతల వద్ద సేవా పన్ను వసూలు చేయలేదు. 2016లో కాగ్ నుండి వచ్చిన అభ్యంతరానికి మా ఆడిటర్లు లిఖిత పూర్వకంగా స్పందించారు . ఆ స్పందన తర్వాత ఎలాంటి అధికారుల ఉత్తర్వులు, నోటీసులు అందలేదు. ఏళ్లు గా ఆదాయపు పన్ను సేవా పన్ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. భారత పౌరుడిగా చట్ట పరమైన బాధ్యతలను నేను ఏనాడు మరవలేదని తెలిపారు ఎన్టీఆర్. సేవా పన్ను విషయంలో అధికారుల నుండి ఆదేశాలు అందలేదు. ఒక వేళ నేను చెల్సించాల్సిన రుసుము ఏదైన ఉంటే అణా పైసతో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని క్లియర్ గా చెప్పారు ఎన్టీఆర్. చట్టానికి ఎల్లప్పుడు కట్టుబడి ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. అందుకే సేవా పన్ను విషయంలోను అదే పాటిస్తున్నా అని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.