ఫిదా కలెక్షన్ల సునామీ…

253
fidaa-movie-
- Advertisement -

శేఖర్ కమ్ముల తీసిన అద్భుత ప్రేమకావ్యం ‘ఫిదా’పై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇంటా బయట ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా  వసూళ్లు  విడుదలైన రెండువారాల్లోనే ఇప్పటికే 60 కోట్ల రూపాయల మార్కును దాటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

fidaa-movie

దర్శకుడు శేఖర్‌కమ్ముల కెరీర్‌లెనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన ఫిదా నికార్సయిన తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఓ ప్రేమకథ. ఈ చిత్రంతో కథానాయికగా పరిచయమైన సాయిపల్లవి తెలుగుప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర పోషించి, బాన్సువాడ భానుమతిగా పేరు తెచ్చుకుంది.  ఫిదా తర్వాత, గత వారంలో వచ్చిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో.. ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ సినిమా మెగా ఫ్యామిలీ హీరోల వసూళ్ల రికార్డులను చెరిపేస్తూ సాగుతోంది.

Fidaa-Movie

రెండు వారాల షేర్ రూ.34.8కోట్లు కాగా, గ్రాస్ 60కోట్లుగా ఉందని నిర్మాణవర్గాలు తెలిపాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక చిత్రాల పరాజయంతో వెనుకబడిన శేఖర్‌కమ్ముల ఈ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకొచ్చాడు. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అమెరికాలోనూ తన హవా కొనసాగిస్తోంది. అక్కడి పంపిణీదారుల సమాచారం మేరకు ఫిదా 2 మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవడానికి కొంచెం దూరంలో ఉంది.

- Advertisement -