ఎన్టీఆర్ కాదన్నాడు..చిరు కావాలన్నాడు..

270
Devi prasad,
- Advertisement -

ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీకి మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..హిట్ కొట్టడం చాలా సినిమాలే చూశాం. అలాగే ఒక హీరోకు నచ్చని పాట..మరో హీరో సినిమాలో సందడి చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సేమ్ సిచ్యువేషనే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమాలో చోటు చేసుకుంది. అయితే అది కథ విషయంలో కాదు..సాంగ్ విషయంలో. మెగాస్టార్‌ 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ పాటలు డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఆ పాటలు మెగాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా ‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడు’ పాట మార్మోగిపోతోంది. అయితే ఈ పాట గురించి ఓ ఇంట్రస్టింగ్‌ గ్యాసిప్‌ ఒకటి బయటికొచ్చింది.

Devi prasad,

ఈ ట్యూన్‌ను మొదటిగా ఎన్టీయార్‌ నటించిన ‘జనతాగ్యారేజ్‌’ కోసం సిద్ధం చేశాడట మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీప్రసాద్‌. ఆ ట్యూన్‌ దర్శకుడు కొరటాల శివకు కూడా బాగా నచ్చిందట. అయితే ఎన్టీయార్‌ మాత్రం ఆ ట్యూన్‌తో పెద్దగా ఇంప్రెస్‌ కాలేదట. దాంతో దేవీ మరో ట్యూన్‌ సిద్ధం చేశాడట. అదే ‘నేను పక్కా లోకల్‌’ ట్యూన్‌. అది అందరికీ నచ్చడంతో ప్రొసీడ్‌ అయిపోయారు. కాగా జనతా కోసం సిద్ధం చేసిన ట్యూన్‌ను ఈ సారి ‘ఖైదీ నెంబర్‌ 150’ కోసం చిరంజీవికి, వినాయక్‌కు వినిపించాడట దేవీ. అది ఇద్దరికీ నచ్చడంతో ‘అమ్ముడూ లెట్స్‌ డూ కుమ్ముడు’ పాట రెడీ అయిపోయింది.

సినిమా ఇండస్ర్టీలో ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఒకరికి నచ్చని ట్యూన్‌ మరొకరికి నచ్చుతుంటుంది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఆ రెండు పాటల్లోనూ కాజల్‌ అగర్వాలే నర్తించడం. విశేషం ఏంటంటే దేవి సిద్ధం చేసిన జనతా గ్యారేజ్ లోని పక్కాలోకల్ బాగానే అలరించింది. ఇప్పుడు అమ్మడూ లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కూడా బాగానే సందడి చేస్తోంది. చిరు ఖైదీ సాంగ్ ఇప్పటికే రెండు రిలీజ్ అయ్యాయి. జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -