ముందు ఎన్టీఆర్ తోనా ?..చరణ్ తోనా ?

34
- Advertisement -

ఎంతో కాలంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన ‘స‌లార్’ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. దీంతో, ప్రశాంత్ నీల్ క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ ఇద్దరూ ప్రశాంత్ నీల్ ను ఇంటికి పిలిచి మరీ సినిమా చేయమని రిక్వెస్ట్ చేశారు. దీంతో, చరణ్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ వార్త హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’తో బిజీగా ఉన్న చరణ్, ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ కేటాయించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

కాకపోతే, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. మరి ఎన్టీఆర్ సినిమా ముందు మొదలు అవుతుందా ?, లేక చరణ్ సినిమా ముందు మొదలు అవుతుందా ? అనేది చూడాలి. ఇక చరణ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో చరణ్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారట. ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కించే విధంగా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. 2024 సమ్మర్ తర్వాత షూటింగ్ ప్రారంభించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైతే దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని ఇన్సైడ్ టాక్.

అన్నట్టు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ పనిచేయబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా విషయంపై చర్చలు కూడా ప్రశాంత్ నీల్ తో జరిపారని తెలుస్తోంది. అయితే, ఈ కథ‌ను సిద్ధం చేయ‌డానికి ప్రశాంత్ నీల్ కు చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఏదీ ఏమైనప్పటికీ ఈ సినిమా విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇంతకీ ముందు ఎన్టీఆర్ సినిమానా ?, చరణ్ సినిమానా ? అనేదే ప్రశాంత్ నీల్ తేల్చుకోవాల్సి ఉంది.

Also Read:బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో!

- Advertisement -