ఎన్టీఆర్ నుంచి సర్ ప్రైజింగ్ న్యూస్

19
- Advertisement -

బింబిసార త‌ర్వాత కళ్యాణ్ రామ్ న‌టిస్తున్న చిత్రం అమిగోస్. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో రాజేంద్ర రెడ్డి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఫిబ్ర‌వరి 10న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఫిబ్ర‌వరి 5న ప్రీ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తుంది చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ హాజ‌రు కాబోతున్నాడు. ఈ వేడుకలో నందమూరి అభిమానులు కోసం తారకరత్న ఆరోగ్యం పై ఎన్టీఆర్ స్పష్టత ఇవ్వబోతున్నారు. అలాగే నందమూరి అభిమానులు కోసం ఈ వేడుకలో ఎన్టీఆర్ ఓ సర్ ప్రైజింగ్ విషయాన్ని చెప్పబోతున్నాడట.

ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ లాంఛ్ క‌ర్నూలులో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, “అమిగోస్ సినిమా అంద‌రి అంచ‌నాలను అందుకుంటుంద‌ని, ఈ సినిమా ఎవ‌రినీ డిజ‌ప్పాయింట్ చేయ‌ద‌ని, న‌న్ను న‌మ్మి సినిమాకు రండి” అని హామీ ఇచ్చాడు. నిజానికి కళ్యాణ్ రామ్ గతంలో తన సినిమా గురించి ఎప్పుడూ ఇంత నమ్మకంగా చెప్పలేదు. కానీ అమిగోస్ విషయంలో మాత్రం కళ్యాణ్ రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి…

బాలీవుడ్ కొత్త జంటపై క్వీన్ పొగడ్త…

పవన్ లుక్ పై చర్చ

బుల్లితెరపై అదరగొట్టిన కాంతార…

- Advertisement -