నాగచైతన్య, సమంతల పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయి. అక్టోబర్ ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ వీరి వివాహం జరగనుంది. సమంత- చైతూ వివాహ సమయం కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గోవాలోని ఓ రిసార్ట్ లో ఈ శుక్రవారం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం .. శనివారం రోజున హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ వివాహ వేడుక ఖర్చు 10 కోట్లు అని టాక్.
ఈ వేడుకకి అత్యంత ముఖ్యమనుకున్న 150 మంది అతిథులను ఆహ్వానించారు. ఆ జాబితాలో ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా వుంది. ఎన్టీఆర్ ను చైతూ .. సమంత స్వయంగా ఆహ్వానించారు. అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్న యూరప్ ట్రిప్ కారణంగా, ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది. ‘జై లవ కుశ’ సినిమా కోసం .. ‘బిగ్ బాస్’ కార్యక్రమం కోసం తీరికలేకుండా పనిచేసిన ఎన్టీఆర్, ఫ్యామిలీతో కలసి యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక ఆయన నెక్స్ట్ మూవీ ఉంటుంది.