పెళ్లి చూపులు ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్!

345
ntr
- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టిస్తున్నాడు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈమూవీ షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్తి చేసుకుంది. ఈ మూవీని 2021 జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మూవీ త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. ఇటివ‌లే ఈ మూవీ టైటిల్ ను కూడా ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ నిర్మాత చిన‌బాబు ఈమూవీని నిర్మించ‌గా త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి.

ఇక ఈమూవీ త‌ర్వాత ఎన్టీఆర్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడ‌ని ఆస‌క్తి నెల‌కొంది. లిస్ట్ కొంత మంది ద‌ర్శ‌కులు ఉన్నా క‌థ‌లు న‌చ్చ‌క‌పోవ‌డంతో వెయిటింగ్ లోఉంచాడ‌ట‌. తాజాగా ఉన్న స‌మాచారం మేర‌కు పెళ్లి చూపులు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తో ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్న‌ట్లు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఇటివ‌లే త‌రుణ్ భాస్క‌ర్ ఎన్టీఆర్ కు క‌థ వినిపించాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో పూర్తి స్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట ఎన్టీఆర్. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

- Advertisement -