దేవర చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెకండ్ పార్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తర్వాత ఎన్టీఆర్… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రంలో నటించబోతున్నాడు.
ఈ భారీ సినిమాపై ఓ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1960ల భారతదేశంలో నేపథ్యంగా జరుగుతుందనీ, జాతీయవాదం అనే అంశాలను పునాదిగా చేసుకున్నదని చెప్పబడుతోంది. ఈ ఆసక్తికరమైన ఊహాగానాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
“సలార్” సినిమాతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఎన్టీఆర్‌తో కలిసి మళ్లీ సృష్టించగలరా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం “NTRNeel” అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. సాండల్‌వుడ్ బ్యూటీ రుక్మిణి వసంత కథానాయికగా నటించనున్నారని సమాచారం. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. సంగీతాన్ని రవీ బస్రూర్ అందిస్తున్నారు.
Also Read:విజయోత్సవాలు కాదు..సారీ చెప్పాలి!

