పవన్‌తో ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌…?

274
Ntr multistarrer with Pawan..!
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లో ట్రెండ్ నడుస్తోంది. కథ నచ్చితే అగ్రహీరోలు కలిసి నటించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు వెంకీ,మహేష్,పవన్‌ మల్టీస్టారర్‌ మూవీల్లో నటించగా  తాజాగా ఎన్టీఆర్‌..పవన్‌ కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ లో  సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామానాయుడు స్టూడియోస్‌ లో  జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో ఎన్టీఆర్ స్వయంగా పవన్ కు ఎదురెళ్లి, ఆత్మీయ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఆపై కాసేపు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లాడారు.  హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పవన్‌ కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా ఉన్నట్లు సమాచారం.

Ntr multistarrer with Pawan..!

ఈ సినిమా ఎన్టీఆర్‌కు 28వది కాగా నెక్ట్స్‌ పవన్‌తో కలిసి మల్టీస్టారర్‌లో నటించనున్నట్లు సమాచారం. దీనికి పవన్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ వచ్చారని టాక్. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌,ఎన్టీఆర్‌లతో సినిమాలు చేస్తున్న  త్రివిక్రమ్‌…ఈ రెండు సినిమాలు పూర్తికాగానే మల్టీస్టారర్‌ని తెరకెక్కించనున్నారట.

పవన్-ఎన్టీఆర్‌ నేరుగా కలుసుకోవడం ఇది రెండోసారి.  గతంలో రామ్ చరణ్ పెళ్ళిలో ఓసారి కలసి.. గంటపాటు తెగ మాట్లాడేసుకున్నారు. అప్పుడే వీళ్లను చూస్తే చాలా ముచ్చటేసింది. తాజాగా వీరిద్దరు మరోసారి కలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొత్తానికి ఎడమొహం పెడమొహంలా ఉండే నందమూరి- మెగా ఫ్యామిలీ హీరోల నుంచి మల్టీస్టారర్ రానుందన్న వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది.

- Advertisement -