ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు క్రిష్ ఈమూవీ తెరకెక్కించగా నందమూరి బాలకృష్ణ తన బ్యానర్ లో నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్ కథానాయకుడు ను విడుదల చేశారు. మొదట్లో ఈసినిమాపై పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి బాక్సాఫిస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
కథానాయకుడిలో ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని అలాగే మహానాయకుడిలో ఆయన రాజకీయ చరిత్రను చూపించనున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు మూవీని మొదట ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సయయం సరిపొకపోవడంతో ఈమూవీ విడుదలను వాయిదా వేశారు.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14న ఈసినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఈమూవీలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కళ్యాణ్ రామ్ పాత్రలు పూర్తి స్ధాయిలో కనిపించనున్నారు. కథానాయకుడు మూవీ కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకొవడంతో మహానాయకుడిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.