‘క‌థానాయ‌కుడు’ 100అడుగుల కటౌట్..

231
ntr cut out in nijampet
- Advertisement -

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసందే. ఈమూవీని రెండు పార్టులుగా తెర‌కెక్కించారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని  మొత్తం క‌థానాయ‌కుడు గాను ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని మ‌హానాయ‌కుడు గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే రెండు పార్టులు షూటింగ్ పూర్తి చేసుకుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈమూవీకి నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈసినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ను మొద‌లు పెట్టారు చిత్ర‌బృందం.

ntr biopic

ఇటివ‌లే విడుద‌లైన ఈమూవీ ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుండి విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ లుక్ తో వున్న బాలకృష్ణ 100 అడుగుల కటౌట్ ను హైదరాబాద్ – నిజాంపేట్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేశారు. ఈ క‌టౌట్ వీక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. ఈమూవీకి కిర‌వాణి సంగీతం హైలెట్ గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తుంది. ఇక ఫిబ్ర‌వ‌రి 7న ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -