ఎన్టీఆర్ పన్ను కట్టాల్సిందే…

222
NTR get notice on Tax Exemption
- Advertisement -

టెంపర్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్, వన్ సినిమాతో కష్టాల్లో ఉన్న  సుకుమార్‌తో కలిసి చేసిన ఎమోషనల్ ప్రయోగం నాన్నకు ప్రేమతో. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త  లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్, కథా కథనాల ఎంపిక విషయంలో కూడా అదే కొత్తదనం చూపించాడు.  ఈ సినిమాతో ఎన్టీఆర్ కి అందని ద్రాక్షలా ఉన్న 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పారితోషికానికి సంబంధించి పన్ను కట్టాల్సిందేనని కాగ్ ఆక్షేపించింది. నాన్నకు ప్రేమతో సినిమాను పూర్తిగా లండన్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అలా చేసిన సినిమా కాబట్టి.. దానికి గానూ తీసుకున్న పారితోషకాన్ని ‘సేవల ఎగుమతులు’ కింద చూపుతూ ఎన్టీఆర్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది.

నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోగా నటించినందుకు ఎన్టీఆర్‌ లండన్‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 2015లో రూ.7.33 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని కాగ్‌ ఆ నివేదికలో పేర్కొంది. ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసు కింద అతను చెల్లించాల్సిన రూ. 1.10 కోట్ల సర్వీసు పన్ను మినహాయించారని వివరించింది కాగ్. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖను వివరణ కోరగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు పన్ను మినహాయించలేదని, షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నామని సమాధానమిచ్చింది ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం.

వలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా, మరికొంతమంది సినిమా హీరోలు కూడా ఈ ఎత్తుగడను అనుసరిస్తున్నట్టు సమాచారం. వారికి కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయని సమాచారం. పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించిన సినిమాల విషయంలో వారు ఇలాంటి మినహాయింపులను పొందినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -