జయదేవ్‌ లేని లోటు తీరనిది.. ఎన్టీఆర్ ఆవేదన

277
Young tiger Junior NTR
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానుల బాగును కోరుకుంటూ ఉంటారు. అభిమానులు లేకపోతే తాను లేనని అంటుంటా రు. ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. మీకోసం మీ వాళ్లు ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటారు దయచేసి సురక్షితంగా తిరిగి వెళ్లండి అంటూ సూచిస్తారు. అంతలా అభిమానులపై ప్రేమను పెంచుకునే ఎన్టీఆర్‌ నేడు ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది.

కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.. ఈ నేపథ్యంలో తారక్‌ ఆయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. నా ఆప్తుడ ఇక లేడు అంటూ జయదేవ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

- Advertisement -