ఎన్టీఆర్ ఎందుకు రాలేదంటే..?

49
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాకు వివిధ విభాగాల్లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ప్రధానోత్సవానికి ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ ఈ అవార్డుల కార్యక్రమానికి వెళ్లకపోవడంతో పలువురు నెటిజన్లు ఎన్టీఆర్‌ను పిలువలేదా?అని హెచ్‌సీఏ ను ప్రశ్నించారు. దీంతో ట్వీట్టర్ వేదికగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు వివరణ ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాను అభిమానించే వాళ్లకి సపోర్టు చేసేవాళ్లకి నమస్కారం. మేం ఈ అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించాం. భారత్‌లో ఓ కొత్త సినిమా షూటింగ్ కారణంగా ఆయన రాలేకపోయారు. మేం త్వరలో ఆయనకు అవార్డును అందజేస్తాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. అని వివరణ ఇచ్చింది. ఈ వివరణపై స్పందిస్తూ మరో అభిమాని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాడు. ఇటీవల ఆయన బ్రదర్ మరణించారు. ఎలాంటి షూటింగ్‌లో పాల్గొనడంలేదని…అని క్లారిటీ ఇవ్వగా…దీన్ని పై స్పందిస్తూ ఓ సినిమా షూటింగ్ కారణంగా రాలేకపోతున్నట్లు ఆయన మాతో చెప్పారు. ఆ తర్వాత వాళ్ల బ్రదర్‌ కూడా చనిపోవడంతో సినిమా షూటింగ్‌ నిలిపివేశారు అని హెచ్‌సీఏ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి…

సామజవరగమన..గ్లింప్స్ విడుదల

అతడు దారిలోనే త్రివిక్రమ్?

ఎనౌన్స్ మెంట్ లేట్ .. రీజన్ అదే?

- Advertisement -