తొలిసారిగా ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించిన చిత్రం ‘జై లవ కుశ’. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా వున్నాడు. ఇక లవ కుమార్ పాత్ర జోడీగా రాశిఖన్నా అలరించనుందని సమాచారం. ఈ సినిమాలో తన పాత్ర పేరు ‘ప్రియ’ అని తెలుస్తోంది. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలిగా ఆమె ఈ సినిమాలో కనిపిస్తుందని అంటున్నారు.
రాశి ఖన్నాకు డాన్స్ రాదన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు పోటీ డాన్స్ చేసి మెప్పించడానికి ఎంతగానో కష్టపడిందట రాశి. ఈ విషయంలో ఎన్టీఆర్ ఎంతగానో మెచ్చుకున్నాడు. అయితే రాశి ఖన్నా డబ్బింగ్ చెబుతానంటే మాత్రం నో అనేశాడట ఎన్టీఆర్.
రాశిఖన్నా తెలుగు నేర్చుకొని మిగతా హీరోయిన్ల కన్నా బాగానే మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంది. దర్శకుడు బాబీ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆయన ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడట. అనవసరమైన రిస్క్ తీసుకోవద్దనీ .. రాశి ఖన్నాకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తోనే చెప్పించమని ఎన్టీఆర్ అనడంతో అలాగే చేశారు. దాంతో డిజప్పాయింట్ చెందిన రాశి.. తన నెక్స్ట్ మూవీకి డబ్బింగ్ చెప్పుకోవాలనే ఆలోచనలో ఉందట.