కొత్త వారికి సలహా ఇస్తున్న అనుష్క…

208
Anushka Shetty Talk about Film Endustry
- Advertisement -

టాలీవుడ్‌లో సక్సెస్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అనుష్క. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్రేకగుర్తింపుని సంపాధించుకుంది ఈ స్వీటి. అయితే సినీ పరిశ్రమ గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. బయట నుంచి చూడ్డానికి సినీ పరిశ్రమ చాలా గ్లామరస్ గా ఉంటుందని, ఇందులో ఉన్నవారంతా ఎంతో హాయిగా ఉన్నట్టు కనిపిస్తుందని, అయితే ఈ వెలుగుల కోసం ఎంతో కష్టం పడాల్సి ఉంటుందని హీరోయిన్ అనుష్క తెలిపింది. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఎప్పుడు తింటారో, ఎన్ని గంటలు నిద్రపోతారో కూడా తెలియదని చెప్పింది. మరోవైపు, ఎలాంటి అలసటను ముఖంలో కనిపించకుండా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Anushka Shetty Talk about Film Endustry

ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని చెప్పింది. సినీరంగంలో నిలబడాలంటే ఒక ప్రధాన లక్షణం ఉండాలని, తాను దాన్నే నమ్మానని అనుష్క చెప్పింది. జీవితంలో తాను దేన్నీ ప్లాన్ చేసుకోలేదని… అయితే, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం దాని అంతు చూడాలని తెలిపింది. తాను ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ ఫీల్డ్ లోకి వచ్చానని చెప్పింది.

- Advertisement -