అన్నకు బాకీ తీర్చేసిన ఎన్టీఆర్‌..!

394
NTR birthday wishes to Kalyanram
NTR birthday wishes to Kalyanram
- Advertisement -

హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌.. పుట్టినరోజు నేడు. ఈ సంధర్బంగా ఎన్టీఆర్‌.. కళ్యాణ్‌ రామ్‌ని వెనక నుంచి హత్తుకున్న ఫొటో ఒకటి పోస్ట్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే అన్నా..’ అని ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్‌ ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే 8 వేలకు పైగా లైకులు వచ్చాయి. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కూడా ఎన్టీఆర్‌కు ఇదేస్టైల్లో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన సంగతి తెలిసిందే.. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అని ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఫొటో ఒక‌టి పోస్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెండు ఫొటోలు చూస్తే.. అన్నయ్య ఆ రోజు పెట్టినట్లే ఇద్దరి మధ్య అనుబంధాన్ని చాటే ఫొటో పెట్టి బాకీ తీర్చేశాడు తారక్.

NTR-Birthday-Wishes-to-Kalyan-Ram

1989లో బాలాగోపాలుడి సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్‌ రామ్‌.. హీరోగా మాత్రం రామోజీ రావు నిర్మించిన తొలిచూపులోనే(2003) సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత అభిమన్యు(2004) సినిమా చేశాడు. ఈ రెండు ఫ్లాపైనప్పటికీ.. 2005తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌ అని సొంత బ్యానర్‌ ఏర్పాటు చేసుకొని సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అతనొక్కడే సినిమా సినిమా నిర్మించాడు. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఆ తరువాత ఆసాధ్యుడితో మరోసారి నిరాశపరిచాడు.. సముద్రతో విజయదశమి.. తేజతో లక్ష్మీ కళ్యాణం సినిమాలు పెద్దగా ఆడలేదు.. ఆ తరువాత కళ్యాణ్ సొంత ప్రొడక్షన్‌లో చేసిన సినిమా హరేరామ్ కళ్యాణ్ లో ఉన్న నటుడిని బయటపెట్టింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. మధ్యలో జయీభవ, కళ్యాణ్ రామ్ కత్తి, ఓ 3డీ  సినిమాలు వచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు.

2015లో పటాస్‌తో పోలీసుగా అటు యాక్షన్‌తో, ఇటు కామెడీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఇజం సినిమా కూడా ఫ్లాప్ అయింది. కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం ‘ఎంఎల్‌ఏ’ చిత్రంలో నటిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సాయంత్రం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కాగా, ఎన్టీఆర్ తొలిసారిగా కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో చేస్తున్న ‘జై లవకుశ’ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -