ఎన్టీఆర్ జయంతి..ముగ్గురు హీరోయిన్స్‌తో దర్శకేంద్రుడి సినిమా

345
raghavendra rao
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి,అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొత్త సినిమాను ప్రకటించారు. నా యాభై సంవత్సరాల సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిదని గుర్తచేసిన ఆయన ఆ మహానుభావుడి పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమని చెప్పిన ఆయన ముగ్గురు దర్శకులు,ముగ్గురు హీరోయిన్స్‌తో మూవీ తెరకెక్కనుందని చెప్పారు. ఇక హీరో ఎవరు అనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలు త్వరలో #JoharNTR అంటూ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

2017లో వచ్చిన ఓం నమో వేంకటేశాయ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. హీరో మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేయడంలో హీరోయిన్ అందచందాల‌ను అందంగా ప్రెజెంట్ చేయ‌డంలో ఆయనను మించిన దర్శకులు లేరు.నాటి సూప‌ర్‌స్టార్స్ య‌న్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ నుండి నేటి కుర్ర హీరోల వ‌ర‌కు ఆయ‌న సినిమాలు తెర‌కెక్కించారు. ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి అగ్రశ్రేణి దర్శకుడిగా గుర్తింపు పొందారు.

- Advertisement -