NTR:ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ షురూ!

73
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈసారి చాలా గ్రాండ్‌గా ఉండబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న తొలి పుట్టినరోజు ఇది. అందుకే, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రీరిలీజ్ చేయబోతున్నారు. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ‘ఆది’ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఇప్ప‌టికే ఒకసారి రీరిలీజ్ చేశారు. కాగా, మ‌రోసారి ఈ చిత్రం ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్కు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. 4k క్వాలిటీలో ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారట. ఈ సినిమాతో పాటు సింహాద్రి సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నారు.

ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచిపోయింది సింహాద్రి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన రెండో సినిమా కావ‌డం దీనికి బాగా క‌లిసొచ్చింది. హై ఓల్టేజ్ మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అప్ప‌ట్లో రికార్డ్ రేంజ్ లో క‌లెక్ష‌న్ల‌ను కురిపించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయ‌డానికి ఇప్పటికే సన్నాహాలు చేశారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ సినిమా రీరిలీజ్ కానున్న‌ట్లు అఫీషియల్‌గా ప్ర‌క‌టించారు. మొత్తానికి మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ భారీ ఎత్తున బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి…

Re-release:త్వరలో మోసగాళ్లకు మోసగాడు.!

2nd డే దసరా కలెక్షన్స్.. అన్నీ కోట్లే !

రావణాసుర నెక్ట్స్‌ లెవల్‌..హర్షవర్థన్‌

- Advertisement -