ఎన్టీఆర్‌లో విద్యాబాలన్‌

218
vidya balan
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్‌ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుపెంచేసింది చిత్రయూనిట్. రేపు ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కుతుండగా సినీ నేపథ్యంలో కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఫిబ్రవరి 7న రాజకీయ జీవితం నేపథ్యంలో మహానాయకుడు విడుదల కానుంది.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా ఎన్టీఆర్‌ సతీమణి బసవతారం పాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. హర్మోనియం వాయిస్తున్న విద్యాలుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిసెంబర్ 21న అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.

ntr biopic

ఇక ఈ సినిమాలో మొత్తం ప‌ది మందికి పైగా హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌లో తార‌క రామారావు శ్రీమతి బసవతారకం పాత్ర‌లో విద్యాబాలన్ పోషిస్తుండ‌గా , సావిత్రి పాత్రలో నిత్యామీనన్, కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్,జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్, ప్రభగా శ్రియ,షావుకారి జానకి పాత్రలో షాలినీ పాండే, శ్రీదేవి పాత్రలో రకుల్, జయప్రద పాత్రలో హన్సిక నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో ఆమని,ఈషా రెబ్బా ,మంజిమామోహన్,పూనమ్ బజ్వా కనిపించనున్నారు. మొత్తంగా పదిమంది హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

- Advertisement -