మ‌రోసారి మ‌హాన‌టి పాత్ర‌లో కీర్తి సురేశ్..

220
Mahanati

అల‌నాటి అందాల న‌టి సావిత్రి జీవిత‌చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. ఈసినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మూవీలో మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించి మంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు. కీర్తి సురేష్ న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. కీర్తి సురేశ్ న‌ట‌న‌తో మ‌రోసారి సావిత్రిని గుర్తుతెచ్చుకున్నారు ప్రేక్ష‌కులు. ఈసినిమా త‌ర్వాత కీర్తి సురేష్ ప‌లు బ‌యోపిక్ ల‌లో న‌టించేందుకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం కీర్తి సురేష్ మ‌రోసారి సావిత్రి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.

keerhi suresh, ntr biopic

మాజీ ముఖ్య‌మంత్రి, మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్కించునున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ అనే టైటిల్ తో హీరో బాల‌కృష్ణ ఈసినిమాను నిర్మించ‌గా…క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుండ‌టంతో ఈసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం ఈసినిమాలో న‌టించే న‌టీ న‌టుల ఎంపిక‌లో బిజీగా ఉన్నారు ద‌ర్శ‌కుడు క్రిష్, హీరో బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కొన్న క‌ష్టాల‌ను త‌న అనుభ‌వాల‌ను, త‌న‌తో న‌డిచిన వ్య‌క్తుల గురించి ఈసినిమాలో చూపించ‌నున్నారు. అయితే ఈసినిమాలో న‌టించే న‌టిన‌టుల పేర్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికి కొంత మంది పేర్లు మాత్రం విన‌బడుతున్నాయి.

keerhi suresh, ntr biopic
ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌గా..ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్, ఏఎన్నార్ పాత్ర‌లో నాగ చైత‌న్య‌, సూప‌ర్ స్టార్ కృష్ణ పాత్ర‌లో మ‌హేశ్ బాబు, ఇక ఎన్టీఆర్ తో చాలా వ‌ర‌కూ సినిమాలు తీసిన సావిత్రి పాత్ర‌ను కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఉండ‌నుంద‌ని స‌మాచారం. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ను తీసుకున్న‌ట్లు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. మ‌హాన‌టి సినిమాలో ఆమె న‌ట‌న చూసి ఫిదా అయిపోయిన ప్రేక్ష‌కులు మ‌రోసారి ఆమె సావిత్రి పాత్ర‌లో న‌టిస్తే బాగుంటుంద‌ని కీర్తి సురేష్ ను క‌న్పామ్ చేశారని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్నారు.