సీఎం కేసీఆర్‌..భోళాశంకరుడు:ఎంపీ కవిత

223
mp kavitha

రైతులు,పేదవారి సంక్షేమం కోసం కృషిచేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్‌ని అని స్పష్టం చేసింది నిజామాబాద్ ఎంపీ కవిత. సోమవారం జగిత్యాల జిల్లాలోని కల్లెడ గ్రామంలో పర్యటించిన కవిత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ మసీదు,స్మశాన వాటికతో పాటు అన్ని కులసంఘాలకు భవనాలు,అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపింది.

బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని…ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను తీసుకొస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ భోళా శంకరుడు అని కొనియాడింది. కేసీఆర్‌కు ఆడబిడ్డలంటే ప్రత్యేక ప్రేమని అందుకే షాదిముబారక్‌,కల్యాణలక్ష్మీ పథకాలతో పాటు కేసీఆర్‌ కిట్‌లను అందిస్తున్నామని చెప్పారు.

kavitha

కల్లెడ మహిళా సంఘం భవన నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని తెలిపింది. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని…కల్లెడ గ్రామానికి 100 డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపింది.