జనవరి 9 న #NTRకథానాయకుడు

224
- Advertisement -

లెజండరీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్. నటసింహం బాలకృష్ణ,క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ సినీ,రాజకీయ జీవితంలోని ప్రధాన ఘట్టాలుగా దృశ్యకావ్యంగా వస్తున్న ఈ చిత్రంలో పాత్రల ఎంపికతోనే అంచనాలను పెంచేశారు.

NTR Biopic

ఇప్పటివరకు చంద్రబాబు పాత్రలో రానా,ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్ లుక్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించేసింది చిత్రయూనిట్. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..కానీ కథగా మారే నాయకుడొక్కడే ఉంటాడు అంటూ రిలీజ్‌ డేట్‌ని చెప్పేశారు. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు.

ntr biopic

ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ త్వరలో రథయాత్రకు సంబంధించిన సీన్స్ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో చైతన్య రథ యాత్ర చాలా ప్రధానమైనది అనే విషయం తెల్సిందే. అందుకే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఆ సీన్స్ కోసం దర్శకుడు క్రిష్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

Rana First Look

- Advertisement -