మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఎన్టీఆర్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య 65 గెటప్‌లలో కనిపిస్తుండగా ఇప్పటివరకు ఆసక్తికర అప్ డేట్స్ ఇస్తూ వచ్చింది చిత్రయూనిట్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. జనవరి 9న సినీ నేపథ్యంలో కథానాయకుడు విడుదల కానుండగా రాజకీయ నేపథ్యంలో మహానాయకుడు ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కథానాయకుడులో ఓ సాంగ్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో సాంగ్‌ను ఇవాళ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4.15 గంటలకు రాజర్షి సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బాలయ్య(ఎన్టీఆర్) గోడపై తెలుగుదేశం సింబల్‌ని వేస్తున్నట్లు చూపించిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక ఈ సినిమాలో మొత్తం పది మందికి పైగా హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌లో తారక రామారావు శ్రీమతి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ పోషిస్తుండగా , సావిత్రి పాత్రలో నిత్యామీనన్, కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్,జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్, ప్రభగా శ్రియ,షావుకారి జానకి పాత్రలో షాలినీ పాండే, శ్రీదేవి పాత్రలో రకుల్, జయప్రద పాత్రలో హన్సిక నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో ఆమని,ఈషా రెబ్బా ,మంజిమామోహన్,పూనమ్ బజ్వా కనిపించనున్నారు. మొత్తంగా పదిమంది హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.