- Advertisement -
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ ఎన్టీఆర్. రెండు భాగాలుగా ఈసినిమాను చిత్రికరిస్తున్నారు. మొదటి పార్ట్ లో ఎన్టీఆర్ నటించిన సినిమాల గురించి రెండవ పార్ట్ లో రాజకీయ జీవితం గురించి చూపించనున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ కథానాయకుడు పేరుతో సినిమాను విడుదల చేయనున్నారు. హైదరాబాద్ లో ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇటివలే ఈమూవీకి సంబంధించిన మొదటి సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆశలు పెరిగిపోయాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా కీరవాణి సంగీతం ఈసినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో మొత్తం 11పాటలు ఉన్నట్లు తెలుస్తుంది. కథకు అనుగుణంగా పాటలు రాసినట్టు తెలుస్తుంది. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ .. రకుల్ .. నిత్యామీనన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
- Advertisement -