మహానీయుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైన సందర్భంగా ఈరోజును చారిత్రాత్మక రోజుగా పరిగనించవచ్చు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకేక్కబోతున్న ‘ఎన్టీఆర్’ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది.
స్వర్గీయ నందమూరి తారకరామారావ్ తన మొదటి సినిమా రంగప్రవేశం ‘మనదేశం’ సినిమాతో జరిగింది. మనదేశం సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ బాలకృష్ణ చెప్పారు. ఈ సీన్ ను గురువారం ‘ఎన్టీఆర్ బయోపిక్’ కోసం షూట్ చేశారు. ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం.
అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ స్వయంగా 1975లో ఒక ఉత్తరం రాయడం జరిగింది. “అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి, ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా ఋణపడ్డట్టే. నాడు నేడు ‘మనదేశం’ తోనే చరిత్రకు శ్రీకారం.
నా శుభాకాంక్షలు, సోదరుడు రామారావు” అని ఎన్టీఆర్ రాసిన ఉత్తరాన్ని నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా వారు తెలుగు ప్రేక్షకుల ఆధర అభిమానాలు కోరుకున్నారు. ‘మనదేశం’ చిత్ర సీన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు బాలకృష్ణ, క్రిష్ తెలిపారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, సాంకేతిక నిపుణులు:, డైరెక్టర్: క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు: సాయి కొర్రపాటి, విష్ణు ఇందురి, మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి, కెమెరామెన్: ,వి.ఎస్. జ్ఞాన శేఖర్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ,ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, కాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వర్య రాజీవ్పి, ఆర్.ఓ: వంశీశేఖర్.